: చంద్రబాబుకు హైదరాబాద్ లో ఉండే హక్కు లేదు: హరీష్ రావు
హైదరాబాద్ లో పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టకుండా చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని, ప్రతిరోజూ కుట్రలు చేసే చంద్రబాబుకు హైదరాబాదులో ఉండే హక్కు లేదని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఆయన అడ్డుపడుతున్నారని తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన విమర్శించారు. పలు ప్రాజెక్ట్ లపై బాబు కుట్రలు చేస్తుంటే తెలంగాణ టీడీపీ నేతలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదులో ఉంటూ ఇటువంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని హరీష్ రావు మండిపడ్డారు.