: ఓడిన వారికి పదవుల్లేవ్ : ఏపీ సీఎం యోచన


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీసుకున్న ఓ నిర్ణయం ఆ పార్టీ సీనియర్ నేతలకు మింగుడు పడటం లేదు. అయితే ఆ నిబంధనేమీ ఈ ఏడాదే రూపొంచినదేమీ కాదు. ఏళ్లుగా పార్టీలో కొనసాగుతూ వస్తోన్న ఆ సంప్రదాయం నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్లు ఎన్నికలొచ్చేదాకా ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. అసలు ఆ సంప్రదాయం ఏమిటంటే, ఎన్నికల్లో ఓడిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వరాదన్నదే ఆ నిర్ణయం. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్ర విభజన, వైకాపా ఓట్లు కొల్లగొట్టడం తదితర కారణాలతో పార్టీ సీనియర్లు గాలి ముద్దు కృష్ణమనాయుడు, పయ్యవుల కేశవ్ లతో పాటు గంపెడాశలతో టీడీపీ తీర్థం పుచ్చుకున్న గల్లా అరుణకుమారి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టీజీ వెంకటేశ్ తదితరులు ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అయితే భారీ ఖర్చు పెట్టినా గెలవలేకపోయిన తమకు ఎలాగూ నామినేటెడ్ పదవులు ఉండనే ఉన్నాయి కదా అని ఆ నేతలు భావించారు. అయితే పార్టీలో కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారికి నామినేటెడ్ పదువులిచ్చేది లేదని ఇటీవల చంద్రబాబు తేల్చి చెప్పారట. చెప్పడమే కాక టీటీడీ పాలక మండలి కూర్పుతో తన ఉద్దేశాన్ని స్పష్టంగా వెల్లడించారు. ఎన్నికల్లో తన మాట విని అసెంబ్లీ టికెట్ ను వేరొకరికి త్యాగం చేసిన చదలవాడ కృష్ణమూర్తికే టీడీపీ పగ్గాలు అప్పజెప్పిన ఆయన ఈ విషయంలో గాలి, గల్లా ప్రతిపాదనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. భవిష్యత్తులోనూ ఇదే తరహాలో చంద్రబాబు ముందుకెళ్లనున్నారని పార్టీ వర్గాల సమాచారం. అయితే ఓడిన సీనియర్లంతా ఐదేళ్ల పాటు ఇంటికో, పార్టీకో అతుక్కుపోవాల్సిందేనన్న మాట.

  • Loading...

More Telugu News