: ఒక ప్లేటు భోజనం రూ. 20 వేలు... వడ్డించేవి మాత్రం ఇవే!
ఆమ్ ఆద్మీ పార్టీకి కావాల్సిన నిధుల కోసం కేజ్రీవాల్ తనతో భోజనం చేసేందుకు రావాలని మెట్రో నగరాల్లో ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రితో కలసి విందారగించాలంటే రూ. 20 వేలు వెచ్చించాల్సి ఉంటుంది. రూ. 20 వేలు ఖరీదు చేసే ఈ ప్లేటు భోజనంలో ఏమేమి వడ్డిస్తారో తెలుసుకోవాలని ఉందా? ఇదిగో ఆ మెనూ... రోస్టెడ్ టొమాటో సూప్, వెజ్ హక్కా నూడుల్స్, జీరా రైస్, దాల్ మఖాని, ఆలూ గోబీ మసాలా, పనీర్ లబాద్బార్, మలాయ్ కోఫ్తా, రోటి, మిక్స్ రైతా, చట్నీ, పాపడ్, గ్రీన్ సలాడ్, ఆలూ చనా చాట్ సలాడ్, వెజ్ సలాడ్, డెత్ బై చాకొలేట్, వెనీలా ఐస్ క్రీం, చాక్లెట్ కేక్. ఇంకేం ఒకసారి వెళ్లి ట్రై చేస్తారా?