: శరద్ పవార్ కు తీవ్ర ప్రమాదం... ఎయిర్ అంబులెన్స్ లో తరలింపు


ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ గత రాత్రి తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన జారి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన వెన్నుపూసకు గాయమయింది. కాలు కూడా ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తోంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని ఓ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం, ముంబై తరలించాలని ఆసుపత్రి వైద్యులు సూచించడంతో... పవార్ ను ఎయిర్ అంబులెన్స్ లో ముంబయిలోని బ్రీచ్ కాండి ఆసుపత్రికి ఈ ఉదయం తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News