: శ్రీ సిటీలో ఏపీ ఇండస్ట్రియల్ మిషన్!
పారిశ్రామికంగా ఇప్పటికే శరవేగంగా దూసుకెళుతున్న ఆంధ్రప్రదేశ్, మరింత మేర పురోగతిని త్వరితగతిన సాధించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే అనంతపురంలో అగ్రికల్చర్ మిషన్ ను ఏర్పాటు చేసిన చంద్రబాబు సర్కారు, తాజాగా ఇండస్ట్రియల్ మిషన్ ఏర్పాటుకు రంగంలోకి దిగింది. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్ లో ఈ మిషన్ ను ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబునాయుడు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ మిషన్ ఏర్పాటుతో రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో మరింత దూకుడును పెంచేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది.