: నేడు గవర్నర్ తిరుగు ప్రయాణం
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని నేడు హైదరాబాద్ తిరిగిరానున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర కేబినెట్ లోని పలువురు కీలక మంత్రులతో భేటీ అయ్యేందుకు సోమవారం ఢిల్లీ వెళ్లిన గవర్నర్ రెండు రోజులుగా వారిని కలిసేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటం, పలు కీలక విషయాలపై ప్రధాని బిజీబిజీగా ఉన్న నేపథ్యంలో ఆయనను కలవడం గవర్నర్ కు సాధ్యం కాలేదు. మరోవైపు సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోల దాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనను కూడా గవర్నర్ కలవలేకపోయారు. ఈ దఫా ప్రధాని, హోం మంత్రితో అపాయింట్ మెంట్ ఖరారు చేసుకున్న తర్వాతే ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని కూడా గవర్నర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.