: నేడు ఫార్మా సిటీపై కేసీఆర్ ఏరియల్ సర్వే
తెలంగాణలో ఏర్పాటు కానున్న ఫార్మా సిటీ భూములపై నేడు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయం నుంచి నేటి ఉదయం 11.45 గంటలకు బయలుదేరనున్న కేసీఆర్, రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో ఫార్మాసిటీ కోసం కేటాయించిన భూములను పరిశీలించడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించనున్నారు. రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానం ఖరారైన తర్వాత పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ ఈ దిశగా దృష్టి సారించడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకునే క్రమంలోనే కేసీఆర్ ఈ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం.