: ముందస్తు ఎజెండాతోనే మీడియా ప్రశ్నలు: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మీడియా వైఖరిపై తన నిరసనను వ్యక్తం చేశారు. ముందస్తు ఎజెండాను రూపొందించుకునే మీడియా, తామనుకున్న మేరకే సమాధానాలు రాబట్టేందుకు యత్నిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి ఇండియా టీవీలో ప్రసారమవుతున్న ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటర్వ్యూల సందర్భంగా మీడియా వ్యవహరిస్తున్న వైఖరిని ఈ సందర్భంగా ఆయన తప్పుబట్టారు. ముందస్తు ఎజెండాతో వచ్చే మీడియా మిత్రులు, వారనుకున్న మేరకే సమాధానాలు వచ్చేలా ప్రశ్నలను సంధిస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాక వారనుకున్న సమాధానం వచ్చేదాకా వదలడం లేదని కూడా ఆయన ఆరోపించారు. వారనుకున్న సమాధానం రాగానే, అక్కడితోనే ముగించేస్తున్నారని మోదీ చెప్పారు.