: టీడీపీలో మాట్లాడే స్వేచ్ఛ లేదు : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
తెలంగాణపై టీడీపీలో మాట్లాడే స్వేచ్ఛ లేకపోవడం వల్లే పార్టీకి రాజీనామా చేశానని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కె.చంద్రశేఖరరావును కలిసినంత మాత్రాన పార్టీ నుంచి తనను సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. కమలాకర్ ఈ నెల 25న గులాబీ కండువా కప్పుకోనున్నారు.