: విశాఖను పరిశీలించనున్న ప్రపంచ బ్యాంకు బృందం
హుదూద్ తుపాను విశాఖపట్టణంపై చూపిన ప్రభావాన్ని ప్రపంచ బ్యాంకు బృందం స్వయంగా పర్యటించి తెలుసుకోనుంది. ఇందుకోసం ఈ నెల 4వ తేదీన ప్రపంచ బ్యాంకు బృందం విశాఖను సందర్శించనుంది. విశాఖను స్మార్ట్ సిటీగా పునర్నిర్మిస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో, ప్రపంచ బ్యాంకు బృందం సందర్శనకు రావడం ఆసక్తి రేపుతోంది. విశాఖను సందర్శించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఈ బృందం సమావేశం అవుతుంది. ఈ సందర్భంగా ఉభయులూ పలు అంశాలు చర్చించనున్నారు.