: బీజేపీపై పరువు నష్టం దావా వేస్తా: కేజ్రీవాల్
బీజేపీపై పరువునష్టం దావా వేస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ అసత్యాలు ప్రచారం చేస్తూ తమ ప్రతిష్ఠను మంటగలుపుతోందని అన్నారు. ఆప్ నేతలు ఎన్జీవోల ద్వారా నిధులు దారి మళ్లించుకుంటున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న విషయంపై ఆయన మండిపడ్డారు. అవినీతిని ఉపేక్షించేది లేదని తెలిపిన కేజ్రీవాల్, తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టవద్దని హెచ్చరించారు.