: బీజేపీ అంటే 'భారతీయ జోకర్ పార్టీ': మమతా బెనర్జీ మేనల్లుడు


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, 'ఆలిండియా తృణమూల్ యువ' అధ్యక్షుడు అభిషేక్ బెనర్జీ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు రోజుకు ఐదుసార్లు బట్టలు మార్చేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారని అన్నారు. ఆ పార్టీ 'భారతీయ జోకర్ పార్టీ'గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. స్థానికంగా నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ, "పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎదుర్కోలేమని వారికి (బీజేపీ) తెలుసు. బెంగాల్ ప్రజలు శాంతి, శ్రేయస్సును కోరుకుంటున్నారు. కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగాయి. ఎప్పటికీ బెంగాల్లో వారు విజయం సాధించలేరు" అని అన్నారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యంగా మాట్లాడిన మమతా మేనల్లుడు, బెంగాల్ కు కొంతమంది వలస పక్షుల్లా వచ్చి ర్యాలీలు నిర్వహించి ఢిల్లీ వెళ్లిపోయారని, కానీ ఎప్పటికీ గెలవలేరన్నారు. దేశానికి విదేశాంగ మంత్రి అవసరం లేదని, ఎందుకంటే మన ప్రధాని ఆరు నెలల్లో ఐదు నెలలు విదేశాల్లోనే గడుపుతుంటారని ఎద్దేవా చేశారు. ప్రైవేట్ జెట్స్ లో ప్రయాణిస్తూ, విదేశాలకు వెళ్లినప్పుడు తరచుగా దుస్తులు మార్చేవారని వ్యాఖ్యానించారు. కానీ, మమతా అలా కాదని, చిన్న ఇంటిలో ఉంటూ, హవాయి చెప్పులు మాత్రమే వేసుకుని, మామూలు చీరే ధరిస్తారన్నారు.

  • Loading...

More Telugu News