: బాబును నిలదీయడానికే ధర్నాలు: జగన్


చంద్రబాబు ఎన్నికల వేళ చెప్పిన మాటలతో రైతులు, డ్వాక్రా మహిళలు మోసపోయారని, ఇచ్చిన హామీలను అమలు చేయని బాబును నిలదీయడానికే తాము ధర్నాలు చేస్తున్నామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏ ప్రభుత్వం మీదైనా ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కనీసం రెండేళ్లు పడుతుందని, ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వంపై ఆరు నెలలకే వ్యతిరేకత వచ్చిందన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 5న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపడుతున్నామని జగన్ తెలిపారు.

  • Loading...

More Telugu News