: బీమా బిల్లుపై ఒప్పందానికి వచ్చిన బీజీపీ, కాంగ్రెస్
బీమా బిల్లు ఎలాంటి ఆటంకం లేకుండా ఉభయసభల్లో ఆమోదం పొందేలా కనిపిస్తోంది. బీమా బిల్లులో మార్పులు చేయకుండా లోక్ సభ, రాజ్యసభలో ప్రవేశపెడితే అడ్డుకుని తీరుతామని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన తదితర పార్టీలు బీజేపీకి అల్టిమేటం జారీ చేశాయి. ఈ నేపథ్యంలో, బీజేపీ బీమా బిల్లుపై కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపింది. విపక్షాల సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది. దీంతో, వివాదం లేకుండా బీమా బిల్లు రాజ్యసభలో ఈ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదం పొందే అవకాశం ఉంది.