: తిరిగి కాంగ్రెస్ లోకి జగ్గారెడ్డి?
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) మరోసారి పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. మళ్లీ కాంగ్రెస్ పార్టీలో రావాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తరఫున సంగారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన, ఆ తర్వాత బీజేపీలోకి చేరి గత ఎన్నికల్లో మెదక్ పార్లమెంటరీ స్థానానికి పోటీపడ్డారు. మొదట్లో బీజేపీ కార్యకర్తగా ఉండి, ఆ తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్లిన ఆయన, అటు నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు. ఉప ఎన్నికలకు కొన్నాళ్ల ముందు జగ్గారెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు పావులు కదుపుతున్నారు.