: పెట్రోలు, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంపు


పెట్రోలు ధరలు తగ్గి 24 గంటలు కూడా గడవక ముందే కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంచేసింది. చమురు సంస్థలు పెట్రోలు ధర తగ్గించడంతో సామాన్యుడు సంబర పడిపోతున్నంతలో ఈ ప్రకటన వెలువడింది. లీటర్ పెట్రోలుపై 2.25 రూపాయలు, డీజిల్ పై రూపాయి ఎక్సైజ్ సుంకం పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు నిర్ణయం నేటి అర్థరాత్రి నుంచి అమలులోకి రానుందని తెలిపింది. ఈ సుంకం పెంచడం ద్వారా కేంద్రానికి రూ.4000 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News