: ఏపిలగుంట గ్రామస్తులపై వైకాపా నేత రామకృష్ణారెడ్డి అనుచరుల దాడి
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఏపిలగుంటలో వైకాపా నేత రామకృష్ణారెడ్డి అనుచరులు మంగళవారం స్వైరవిహారం చేశారు. తమ భూకబ్జాకు అడ్డొచ్చారన్న నెపంతో గ్రామస్తుల ఇళ్లపై దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై బాధితుల నుంచి ఫిర్యాదునందుకున్న పోలీసులు కేసు నమోదు విషయమై పరిశీలిస్తున్నారు. ఏపిలగుంటలో రామకృష్ణారెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో మంగళవారం రామకృష్ణారెడ్డి అనుచరులను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఊగిపోయిన ఆయన అనుచరులు దాడులకు తెగబడ్డారు.