: బీజేపీ నేతలకు మోదీ కఠిన హెచ్చరిక


పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ఇరుకున పడింది. పార్లమెంటులో ఈరోజు ఆ వ్యాఖ్యలు దుమారాన్నే రేపాయి. దాంతో, సదరు సభ్యురాలు క్షమాపణ చెప్పాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు తీవ్రంగా పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్ సభలో స్పందించిన మోదీ, బీజేపీ సభ్యులకు కఠిన హెచ్చరిక చేశారు. "జాతిని తప్పుబట్టించే విధంగా ప్రసంగించవద్దు. ఇటువంటి వాటిపై రాజీపడే సమస్యలేదు" అని అన్నారు.

  • Loading...

More Telugu News