: 'గుడ్ గవర్నెన్స్ డే'గా ఇకనుంచి వాజ్ పేయి పుట్టినరోజు


మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్ పేయి పుట్టినరోజును ఇకనుంచి 'గుడ్ గవర్నెన్స్ డే'గా నిర్వహించబోతున్నారు. ఈ మేరకు ఈరోజు నిర్వహించిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు ప్రతిపాదన చేశారు. అందుకు బీజేపీ నేతలందరూ ఏకగ్రీవ అంగీకారం తెలిపారు. ఈ నెల 25న వాజ్ పేయి తన పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే మోదీ ఈ కొత్త ఆలోచన చేశారు. రాజకీయ వర్గాల్లో అత్యంత గౌరవనీయుడైన వాజ్ పేయి ఇటీవలే బీజేపీ 'మార్గ్ దర్శక్' కమిటీలో ఓ భాగమయ్యారు.

  • Loading...

More Telugu News