: బాలీవుడ్ ప్రముఖ కమెడియన్ దేవేన్ వర్మ మృతి


బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు దేవేన్ వర్మ (78) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న ఆయన, ఈ రోజు గుండెపోటుతో పూణెలో తమ నివాసంలో మరణించినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆయనకు భార్య రూప, ఓ కుమార్తె ఉన్నారు. బసు ఛటర్జీ, హృషికేశ్ ముఖర్జీ, గుల్జార్ వంటి పలువురు దిగ్గజ దర్శకులతో దేవేన్ పనిచేశారు. 'అంగూర్', 'గోల్ మాల్', 'చోరీ మేరా కామ్', 'అందాజ్ అప్నా అప్నా', 'జుదాయి', 'దిల్ తో పాగల్ హై', 'కోరా కాగజ్' వంటి చిత్రాల్లో తన హాస్య పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. కేవలం నటనే కాకుండా 'బేషరమ్' వంటి చిత్రాలను నిర్మించి, దర్శకత్వం కూడా వహించారు.

  • Loading...

More Telugu News