: ఓ వ్యక్తి సజీవదహనానికి యత్నించిన దుండగులు


ఓ భూమి విషయంలో వచ్చిన తగాదా సజీవ దహనానికి దారి తీయగా, త్రుటిలో ప్రాణాలను కాపాడుకున్నాడో వ్యక్తి. మెదక్ జిల్లా పటాన్‌చెరులో ఓ ఇంటిని తగులబెట్టడం ద్వారా ఆ ఇంటి యజమానిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు కొందరు దుండగులు. ఇంటికి బయట తాళం వేసి కిటికీ గుండా లోపలి పెట్రోల్ చల్లి నిప్పంటించారు. మంటలు చెలరేగటాన్ని గమనించిన ఇంటి యజమాని తలుపులు పగులగొట్టుకొని బయటపడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News