: భారత్ తొలి ప్రాక్టీసు మ్యాచ్ కంగారూలతో... వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ ల షెడ్యూల్ విడుదల


వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ కు సంబంధించి వార్మప్ మ్యాచ్ ల షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. ఫిబ్రవరి 8 నుంచి 13 వరకు ఈ ప్రాక్టీసు మ్యాచ్ లు ఉంటాయి. భారత్ తన తొలి ప్రాక్టీసు మ్యాచ్ ను ఆస్ట్రేలియా జట్టుతో ఆడనుంది. రెండో ప్రాక్టీసు మ్యాచ్ ను ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో ఆడుతుంది. టోర్నీలో పాల్గొనే మొత్తం 14 జట్లు రెండేసి ప్రాక్టీసు మ్యాచ్ లు ఆడతాయి. వరల్డ్ కప్ మ్యాచ్ లు ఫిబ్రవరి 14 నుంచి జరుగుతాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఈ మెగా ఈవెంట్ కు ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. టోర్నీ తొలి రోజున న్యూజిలాండ్ జట్టుతో శ్రీలంక, ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడతాయి. టోర్నీ ఫైనల్ మార్చి 29న మెల్బోర్న్ లో జరుగుతుంది.

  • Loading...

More Telugu News