: దక్షిణాది రాష్ట్రాల్లో స్తంభించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ మూతపడ్డాయి. వేతన సవరణ చేయాలంటూ ఉద్యోగులందరూ సమ్మె బాటపట్టారు. దాదాపు 1.5 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ప్రధానంగా విజయవాడ బెంజి సర్కిల్ లో ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అంతేగాక జోన్ ల వారీగా ఎక్కడికక్కడ ఉద్యోగులు సమ్మె జరుపుతున్నారు. ఇలా ఈనెల 3న ఉత్తర భారతంలో, 4న ఈశాన్య ప్రాంతంలో, 5న దేశ పశ్చిమ ప్రాంతాల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. బ్యాంకు ఉద్యోగుల వేతన పెంపుపై నిన్న (సోమవారం) జరిగిన చర్చల్లో సానుకూల ఫలితం రాకపోవడంతో ఉద్యోగులు సమ్మెకు దిగారు.