: కేంద్ర మంత్రి సాధ్వి జ్యోతి వ్యాఖ్యలపై పెద్దల సభలో రగడ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంగళవారం నాటి రాజ్యసభ సమావేశాల్లో రసాభాస చోటుచేసుకుంది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న సాధ్వి ఆ తరహా అసభ్యకర భాషను వాడటంపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. అంతేకాక సాధ్వి తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విపక్ష సభ్యులకు సర్దిచెప్పేందుకు మరో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ చేసిన యత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.