: రోగుల నగ్న చిత్రాలు తీస్తూ దొరికిపోయిన డాక్టర్... 22 ఏళ్ల జైలు శిక్ష


ఆయనో వైద్యుడు. ప్రాణాంతక క్యాన్సర్ కు చికిత్స చేస్తుంటాడు. తన దగ్గరకు వచ్చే రోగుల నగ్న చిత్రాలను స్పై కెమెరా సాయంతో తీస్తాడు. వైద్య వృత్తికే కళంకం తెచ్చి పెట్టిన ఈ యూకే డాక్టర్ ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. బ్రిటన్ కు చెందిన కాన్సర్ డాక్టర్ బ్రాడ్ బురీ కేంబ్రిడ్జిలో ఓ ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. తన రోగులు బట్టలు మార్చుకుంటుంటే ఫొటోలు తీసేవాడు. ముఖ్యంగా టీనేజ్ లో ఉన్న అమ్మాయిల ఫొటోలు తీసేవాడు. 2009 నుంచి 2013 మధ్య కాలంలో 18 మంది ఫొటోలను తీసినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు. అతని క్లినిక్ పై దాడిచేయగా 16 వేలకు పైగా అసభ్య చిత్రాలు దొరికాయి. బ్రాడ్ పై ఆరోపణలన్నీ రుజువు కావడంతో 22 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్టు కోర్టు తెలిపింది.

  • Loading...

More Telugu News