: ఇక లింగ వివక్షపై సైనిక నియామకాల్లో ప్రశ్నల పరంపర


భారత సైన్యంలో చేరాలనుకునే యువతకు ఇకపై కొత్త తరహా ప్రశ్నలు ఎదురుకానున్నాయి. రోహ్ తక్ బాలికల సాహస కృత్యం నేపథ్యంలో సైనిక నియామకాల్లో లింగ వివక్షపై అభ్యర్థులను భారత సైన్యం శీల శోధన చేయనుంది. రాత పరీక్షతో పాటు మానసిక పరిపక్వతను పరిశీలించే సైకలాజికల్ టెస్ట్ లోనూ ఈ తరహా ప్రశ్నలను సంధించేందుకు భారత సైన్యం రంగం సిద్ధం చేసింది. మహిళల పట్ల సైనికులు మరింత సానుకూలంగా వ్యవహరించడంతో పాటు లింగవివక్షకు వారు దూరంగా ఉండాలన్న భావనతోనే సైన్యం ఈ చర్యలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. రోహ్ తక్ ఘటనలో సైనిక రాత పరీక్షకు ఎంపికైన ఇద్దరు భావి సైనికులు దుశ్చర్యకు పాల్పడ్డారు. దీనిపై హర్యానా పోలీసుల నుంచి నివేదిక అందుకున్న సైన్యం తక్షణమే స్పందించింది. ఆ ఇద్దరు వేధింపురాయుళ్లకు సైన్యంలో ప్రవేశం లేదని ప్రకటించిన సైన్యం, అంతటితో సరిపెట్టకుండా, మున్ముందు ఈ తరహా ఘటనలకు సైనికులను దూరంగానే ఉంచే క్రమంలోనే తాజా చర్యలకు ఉపక్రమించింది.

  • Loading...

More Telugu News