: సోనియా అల్లుడు వాద్రాపై కేంద్ర మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లో ఇటీవలే అడుగుపెట్టి, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సాధ్వీ నిరంజన్ జ్యోతి వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. "రాముడి అనుచరుల ప్రభుత్వాన్ని కోరుకుంటారా? అక్రమ సంతానం అనుచరుల ప్రభుత్వాన్ని కోరుకుంటారా?" అంటూ రాబర్ట్ వాద్రాను ఉద్దేశించి జ్యోతి వ్యాఖ్యానించారు. నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై సర్వత్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు ఆమె వ్యాఖ్యలపై మండిపడ్డారు. అలా వ్యాఖ్యానించారేమిటన్న విలేకరుల ప్రశ్నలకు స్పందించిన జ్యోతి, "అత్యంత సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాద్రాకు అంత ఆస్తులెక్కడివి? వారు దేశాన్ని, దేశ ప్రజలను లూటీ చేశారు" అంటూ ఆమె తన వ్యాఖ్యలను సమర్థించుకునే యత్నం చేశారు.