: పెట్రోల్ బంకులో దోపిడీ దొంగల స్వైర విహారం
నిన్న నెల్లూరు, నేడు గుంటూరు... దోపిడీ దొంగల స్వైర విహారానికి కేంద్రమయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నెల్లూరులోని వైన్ షాపుపై దాడికి దిగి ఓ వ్యక్తిని చంపేసి మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరచడమే కాక నగదును దోచుకెళ్లిన దోపిడీ దొంగలు, సోమవారం రాత్రి గుంటూరు జిల్లాలో చెలరేగిపోయారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు పెట్రోల్ బంకులో దోపిడీ దొంగలు చోరీకి పాల్పడ్డారు. పెట్రోల్ బంకులోని ముగ్గురు సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసిన దొంగలు నగదును అపహరించుకుని వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.