: పాత్రికేయుల మీద దాడిపై కేంద్రం, హర్యానాలకు సుప్రీం నోటీసులు


కేంద్ర ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త బాబా రాంపాల్ అరెస్టు సందర్భంగా పాత్రికేయులపై దాడి జరిగింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, న్యాయ విచారణకు ఆదేశించాలంటూ పాత్రికేయులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు... కేంద్రం, హర్యానా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీచేసింది.

  • Loading...

More Telugu News