: రేపు పీఎం నివాసంలో కీలక సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో రేపు కీలక సమావేశం జరగనుంది. కీలకమైన శాఖలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రులతో ప్రధాని సమావేశం నిర్వహించనున్నారని సమాచారం. ఈ సమావేశంలో 'నూతన సీబీఐ డైరెక్టర్'పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీనితో పాటు మరిన్ని పార్టీ పరమైన అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.