: పాక్ పార్లమెంటు బయట ఇమ్రాన్ ఖాన్ భారీ ర్యాలీ
పాకిస్థాన్ లో రాజకీయ సంక్షోభం ఇంకా సద్దుమణగలేదు. తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఇంకా షరీఫ్ ప్రభుత్వంపై పోరాటం సాగిస్తూనే ఉన్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలతో ఆయన మరోసారి పాక్ పార్లమెంటు ముందు కవాతు చేశారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేయాలని అల్టిమేటం జారీ చేశారు. ఎన్నికల అక్రమాలపై విచారణ చేపట్టాలని, లేని పక్షంలో డిసెంబర్ 16న దేశవ్యాప్త బంద్ చేపడతామని ఆయన హెచ్చరించారు. 2013 లో జరిగిన ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ సర్కారు అవకతవకలకు పాల్పడిందని, దానిపై విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో మద్దతుదారులతో కలిసి ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల అక్రమాలపై విచారణకు డిసెంబర్ 16 వరకు సమయం ఇస్తానని చెప్పిన ఆయన, తర్వాత నిరసనలు, ఆందోళనలతో ఒత్తిడి పెంచుతామని స్పష్టం చేశారు.