: ఎంఐఎం ఆస్తులు కాపాడేందుకే మెట్రో అలైన్ మెంట్ లో మార్పు: టి.కాంగ్రెస్


మెట్రో రైలు అలైన్ మెంట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేసిన మార్పులపై తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఎంఐఎం పార్టీ ఆస్తులు కాపాడేందుకే ఇలా మార్పులు చేసినట్టు ఆ పార్టీ అధికార ప్రతినిధి నిరంజన్ ఆరోపించారు. ఎంఐఎంను సంప్రదించకుండా మెట్రో రైలు ప్రాజెక్టు మార్పులపై నిర్ణయం తీసుకునే దమ్ము సీఎం కేసీఆర్ కు ఉందా? అని ప్రశ్నించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో ఆయన మాట్లాడారు. మెట్రో పాత అలైన్ మెంట్ నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అటు, కాంగ్రెస్ నేత పి.శంకర్రావు మాట్లాడుతూ, విద్యుత్ సమస్య, పింఛన్లు, రుణమాఫీపై అఖిలపక్షంతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. రుణమాఫీపై ప్రభుత్వమే బ్యాంకులకు గ్యారెంటీ ఇవ్వాలన్నారు.

  • Loading...

More Telugu News