: ఐపీఎల్, బీసీసీఐ ఆదాయ వివరాలు అందించండి: సుప్రీంకోర్టు


ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంపై విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్ కు పలు ఆదేశాలు జారీ చేసింది. దోషులెవరో న్యాయస్థానం నిర్ధారిస్తుందని, ఐపీఎల్, ఇతర మ్యాచ్ ల టికెట్ల అమ్మకాల వివరాలు అందజేయాలని ఆదేశించింది. అలాగే ఆటగాళ్ల అమ్మకం, ఆటగాళ్ల ఎంపిక, ఫ్రాంచైజీల ఎంపిక, టెలీకాస్టింగ్ వివరాలు అందజేయాలని శ్రీనివాసన్ ను ఆదేశించింది. బీసీసీఐ, ఐపీఎల్ ఆదాయ వివరాలన్నీ న్యాయస్థానానికి సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో, మరెన్ని లొసుగులు బయటపడనున్నాయో అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News