: జపాన్ మహిళలు పిల్లల్ని కనడం మానేస్తారేమో!: చంద్రబాబు చమత్కారం


నిత్యం అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తున్న జపాన్ ను ప్రపంచం ఆదర్శంగా తీసుకోవాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. జపాన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన ఆయన అక్కడి తన అనుభవాలను వివరించేందుకు సోమవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జపాన్ అభివృద్ధి మంత్రాన్ని కీర్తించిన చంద్రబాబు, అక్కడి మహిళా ఉద్యోగులు సాధిస్తున్న పురోగతినీ కొనియాడారు. అదే సమయంలో వారీ జీవన స్థితిగతులపై హాస్యోక్తులు విసిరారు. ఉద్యోగాల వెంట పరుగులు పెడుతున్న జపాన్ మహిళలు భవిష్యత్తులో ఉద్యోగాలు చేస్తూ పెళ్లిళ్లు చేసుకోవడం మానేస్తారేమోనని వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో వారు పిల్లల్ని కనడం కూడా మానేస్తారేమోనని ఆయన చమత్కరించారు. అభివృద్ధిలో ముందంజలో ఉన్న జపాన్ క్రమబద్ధీకరణలో మాత్రం వెనుకబడిపోయిందని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News