: ఒకే వేదికను పంచుకోనున్న 'ఖాన్'ల త్రయం


షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్... బాలీవుడ్ ను ఏలుతున్న ఈ 'ఖాన్'ల త్రయంలో ఒకరంటే ఒకరికి పడదని అందరికీ తెలుసు. ఈ ముగ్గురూ కలసి వేదికను పంచుకున్న సందర్భాలు అతి తక్కువ. ఈ మధ్య కాలంలో అసలు లేవు. అయితే, ఇటీవల జరిగిన అర్పిత వివాహం సమయంలో సల్మాన్ మిగతా ఇద్దరితో కలిశాడు. అంతేకాని, ముగ్గురు ఖాన్ లూ ఒకేచోట కలవలేదు. షారుఖ్ ముంబైలో జరిగిన వేడుకలకు రాగా, అమీర్ హైదరాబాద్ వచ్చి దగ్గరుండి పెళ్లి తంతుని నడిపించాడు. ఇప్పుడు వీరు ముగ్గురూ కలసి ఒకే చోట కనిపించే సందర్భం వచ్చేసింది. విజయయవంతమైన టెలివిజన్ షో 'ఆప్ కీ అదాలత్'లో వీరు పాల్గొననున్నారు. వీరు ముగ్గురూ కలిస్తే, ఖాన్ ల అభిమానులకు కన్నుల పండుగే. డిసెంబర్ 2న ఢిల్లీ లోని ప్రగతి మైదానంలో వీరితో షో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News