: రివర్స్ గేర్ తో హోండా నుంచి కాస్ట్లీ బైక్


జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా ఖరీదైన బైక్ 'గోల్డ్ వింగ్' ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రివర్స్ గేర్, ఎయిర్ బ్యాగ్, మ్యూజిక్ సిస్టమ్ ఈ బైక్ ప్రత్యేకతలు. గోల్డ్ వింగ్ పేరిట హోండా గత 40 సంవత్సరాలుగా టూరింగ్ బైక్ లను తయారుచేస్తోంది. నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వీటిని భారత్ లోనూ ప్రవేశపెట్టారు. దీని ధర రూ.28.50 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూం ప్రైస్). ఎయిర్ బ్యాగ్ సదుపాయం ఉన్న గోల్డ్ వింగ్ ధర రూ.31.50 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూం ప్రైస్)గా నిర్ణయించారు. ఈ బైక్ కు 6 సిలిండర్ 1832 సీసీ ఇంజన్ అమర్చారు. సీట్లను అడ్జస్ట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. 6 స్పీకర్ 80 వాట్ ఎస్ఆర్ఎస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ద్వారా అత్యద్భుతమైన శబ్దనాణ్యతతో సంగీతం వినవచ్చు. మ్యూజిక్ సిస్టంలో ఐఫోన్, ఐపాడ్, యూఎస్ బీ పోర్ట్ లు పొందుపరిచారు. గోల్డ్ వింగ్ యాంటీ-లాక్ బ్రేకింగ్ (ఏబీఎస్) సిస్టం సహితమైనది. ఓ బైక్ కు ఏబీఎస్ సిస్టం అమర్చడం ఇదే ప్రథమం. రైడర్ రక్షణ కోసం ఎయిర్ బ్యాగ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇక, పార్కింగ్ ప్లేసుల్లో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఎలక్ట్రిక్ రివర్స్ గేర్ పొందుపరిచారు.

  • Loading...

More Telugu News