: బీజేపీ యూ-టర్న్స్ పై కాంగ్రెస్ బుక్ లెట్


పార్లమెంటు శీతాకాల సమావేశాలు రెండోవారం కూడా మరింత హోరెత్తించే అవకాశాలు కనబడుతున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై బీజేపీ తీసుకున్న యూటర్న్స్ పై కాంగ్రెస్ ఓ బుక్ లెట్ తీసుకురాబోతోంది. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీలు, ఇవే అంశాలపై మోదీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలక్ష్యంపై బుక్ లెట్ లో వివరించనుంది. ఈ నేపథ్యంలో సమస్యలపై ఎన్డీఏ ప్రభుత్వ వెనకడుగు, నగదు సబ్సిడీ, బీమా రంగంలో ఎఫ్ డీఐ నిధులు, జీఎస్ టీ వంటి పలు బిల్లులు, అంతేగాక కాగ్ నివేదికపై బీజేపీ వైఖరి, దేశంలో అత్యాచార సంఘటనలను కూడా ఈ బుక్ లెట్ లో పొందుపరుస్తారు. వాటితో పాటు యూపీఏ ప్రతిపాదనలతో 33 పేజీల బుక్ లెట్ ను కాంగ్రెస్ ప్రచురించనుంది. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని పార్లమెంటులో ఇరుకునే పెట్టే నల్లధనం, చైనా సైన్యం దాడి, పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనల అంశాలపై కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ట్విట్టర్ లో ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News