: 'సెజ్'లు పోయి 'నెజ్'లు రానున్నాయి!
స్పెషల్ ఎకనామిక్ జోన్ (ప్రత్యేక ఆర్థిక మండలి - సెజ్)ల స్థానంలో నేచురల్ ఎకనామిక్ జోన్ (సహజ ఆర్థిక మండలి - నెజ్) లను ఏర్పాటు చేయాలని మోదీ భావిస్తున్నారు. పాలనపై తనదైన ముద్ర వేసే దిశగా సాగుతున్న మోదీ 'సెజ్' లను 'నెజ్'లుగా మార్చేందుకు మంత్రివర్గ సహచరులతో చర్చిస్తున్నారు కూడా. నేటి ఉదయం నాగాలాండ్ లోని కిసామా చేరుకున్న ప్రధాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే హార్న్ బిల్ ఫెస్టివల్ ప్రారంభించారు. విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు రూపొందించిన 'ఈశాన్ వికాస్' పథకాన్ని ఆయన ప్రారంభించారు. నాగాలాండ్ లో పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహమందిస్తామని తెలిపారు. అన్ని రాష్ట్రాలలో ఉన్న సెజ్ ల స్థానంలో నెజ్ లను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఈశాన్య ప్రాంతాల్లో 14 కొత్త రైల్వే లైన్ ల కోసం రూ.28 వేల కోట్ల ప్యాకేజీని ప్రధాని ప్రకటించారు.