: బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్ ను చెంపదెబ్బ కొట్టిన యువకుడు
టెలివిజన్ షోలకు పొట్టి దుస్తులతో ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తూ, బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్ ను చెంపదెబ్బ కొట్టాడో యువకుడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. టీవీ షో షూటింగ్ జరుగుతున్న సమయంలో అకిల్ మాలిక్ అనే యువకుడు అమాంతం స్టేజ్ పైకి వెళ్లాడు. గౌహర్ ఖాన్ ను తాకేందుకు ట్రై చేశాడు. కురచ దుస్తుల్లో ఎందుకొచ్చావంటూ అడుగుతూ చెయ్యి చేసుకున్నాడు. సిబ్బంది అప్రమత్తమై అతన్ని పోలీసులకు అప్పజెప్పారు. లైంగిక వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు స్పష్టం చేశారు.