: రికార్డు స్థాయి దిగువకు రూపాయి మారకం విలువ
డాలర్ తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో బలహీనపడింది. సోమవారం ఉదయం డాలర్ కు 62.25 స్థాయికి పడిపోయింది. తొమ్మిది నెలల క్రితం ఫిబ్రవరిలో భారీగా పతనమైన రూపాయి మారకం ఆ తర్వాత కాస్త కోలుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కాస్త ఒడిదుడుకులకు లోనైన రూపాయి మారకం విలువ ఒకానొక సందర్భంలో డాలర్ కు 56 రూపాయల స్థాయికి చేరి... ఇటీవల క్రమంగా పడిపోతూ వస్తోంది. గడచిన ఐదు వారాలుగా పతన దశలోనే పయనిస్తూ వచ్చిన రూపాయి సోమవారం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి డాలర్ కు 62.25 కనిష్ఠ స్థాయికి చేరుకుంది.