: ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మించనున్న దుబాయ్


ఎడారిలో కూడా అత్యున్నతమైన కట్టడాలను ఆశ్చర్యకర రీతిలో నిర్మించి యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది దుబాయ్. ఇప్పుడు మరో భారీ కట్టడానికి దుబాయ్ సిద్ధమవుతోంది. దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు దగ్గర్లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. పర్యావరణహితమైన ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఏకంగా 3,200 కోట్ల డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ ఎయిర్ పోర్టులో ఏ380 విమానాలు టేకాఫ్ తీసుకునేందుకు వీలుగా... 4.5 కిలోమీటర్ల పొడవుతో మొత్తం 5 రన్ వేలు ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో 12 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించే ఈ విమానాశ్రయం... 2020కల్లా 20 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది.

  • Loading...

More Telugu News