: ఏనుగుల దాడిలో రైతు మృతి


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం జరిగిన ఏనుగుల దాడిలో ఓ రైతు మృత్యువాతపడ్డాడు. కుప్పం పరిధిలోని రామకుప్పం మండలం ననియాల గ్రామ పరిధిలోని పొలాలపై దాడి చేసిన ఏనుగులు పంటలను నాశనం చేశాయి. ఇదే క్రమంలో కుప్పం సరిహద్దులోని తమిళనాడు పరిధిలోని వేపనపల్లి అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడికి గురైన రైతు మహదేవప్ప నాయుడు అక్కడికక్కడే మరణించారు. దీంతో సమీపంలోని గ్రామస్థులు భయాందోళనల్లో కూరుకుపోయారు. ఇటీవలి కాలంలో కుప్పం పరిధిలో ఏనుగుల దాడులు మరింత పెరిగిపోయాయి.

  • Loading...

More Telugu News