: బయటున్నోళ్లంతా సెల్'ఫిష్'లు: అలీ
'మేము సైతం' అంటూ హుదూద్ బాధితుల్ని ఆదుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమ చేపట్టిన కార్యక్రమం ఆసక్తికరంగా సాగుతోంది. హైదరాబాదులోని యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న కబడ్డీ ఆటలో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఆటలో ఆటగాళ్లను కొడుతున్నారంటూ హాఫ్ టైంలో బ్లాక్ టైగర్స్ కెప్టన్ మంచు విష్ణు, రెడ్ పాంథర్స్ జట్టు కెప్టన్ మంచు మనోజ్ పై నింద మోపారు. దీనికి మనోజ్ సమాధానం చెబుతూా, కబడ్డీలో జట్ల మధ్య ఉండాల్సింది 'ఎ రిలేషన్ బిట్వీన్ ప్లేయర్స్ షుడ్ బీ ఫిష్ అండ్ ఫిషర్ మన్, బట్ నాట్ బి ఫిష్ అండ్ వాటర్' అంటూ నవ్వులు పూయించారు. దానికి కౌంటర్ గా అలీ మాట్లాడుతూ, 'నీటిలో ఉన్న చేప తన తల్లిని అమ్మా మనం నీటిలో ఎందుకున్నాం, వాళ్లు నీటి బయట ఎందుకున్నారు? అని అడిగిందట. దానికి చేప తల్లి వాళ్లు సెల్'ఫిష్'లు కనుక నీటి బయట ఉన్నారు. మనకి సెల్ఫ్ లేదు కనుక 'ఫిష్'లము' అని చెప్పిందని చెప్పి అలరించారు.