: విష్ణు, మనోజ్ ఆట... వెంకటేష్ కామెంట్ల సందడి!
'మేము సైతం' అంటూ హుదూద్ బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులోని యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో కబడ్డీ ఆటను నిర్వహించారు. మంచు మనోజ్ సారధ్యంలో రెడ్ పాంథర్స్ జట్టును, మంచు విష్ణు ఆధ్వరంలోని బ్లాక్ టైగర్స్ జట్టు ఢీ కొంది. ఆట ఆద్యంతం ఆసక్తిగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతోంది. విష్ణు, మనోజ్ లను ఉత్తేజపరుస్తూ, సరదా కామెంట్లు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ సందడి చేస్తున్నారు. 'కబడ్డీ కబడ్డీ' అంటూనే కూత కూయాలంటూ బ్రహ్మీకి ఆయన గుర్తు చేశారు. కాగా, బ్రహ్మానందాన్ని క్యారెక్టర్ నటి హేమ పట్టుకునేందుకు ప్రయత్నించింది. బ్రహ్మానందం తనదైన స్టయిల్లో కూతకు వెళ్లి ఆకట్టుకున్నారు.