: ఎన్టీఆర్ పేరు తొలగిస్తారా సరే...లేకుంటే రైల్ రోకో: వీహెచ్ అల్టిమేటం


శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్ కు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు తొలగిస్తారా సరే, లేని పక్షంలో రైల్ రోకో నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. హైదరాబాదులోని గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ, ఎంఐఎంకు ఎప్పుడో తలాక్ చెప్పేశామన్నారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో ఎలాంటి పొత్తు ఉండదని వీహెచ్ స్పష్టం చేశారు. పార్టీలోని ఒక నేతకు రెండు పదవులు సరికాదని అధిష్ఠానానికి విన్నవిస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News