: మహేష్, పవన్ ఇద్దరూ ఒకటేనంటున్న త్రివిక్రమ్
సింపుల్ గా ఉండటంలో టాలీవుడ్ సూపర్ స్టార్లు మహేష్ బాబు, పవన్ కల్యాణ్ లు ఇద్దరూ ఒకేలా ఉంటారని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. త్రివిక్రమ్ వీరిద్దరి గురించి తన మనసులో మాటను సమంతాకు చెప్పిన సందర్భం 'మేము సైతం'లో కనిపించింది. మహేష్, పవన్ లు చాలా సహజంగా నటించే గుణాలున్న వారని, ఎంతో కలసిపోతారని త్రివిక్రమ్ చెప్పారు. అందువల్లనే వీరిద్దరితో కలసి రెండేసి సినిమాలు చేయగలిగానని చెప్పారు.