: అప్పుడు కబడ్డి ఆడేందుకు వెళ్ళటమే కేంద్ర మంత్రిని చేసింది: వెంకయ్య నాయుడు
చిన్న వయస్సులో తాను కబడ్డి ఆడేందుకు వెళ్లి, ఆర్ఎస్ఎస్ లో చేరానని, అప్పుడు పడ్డ తొలి అడుగు తననిప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నిలిపిందని ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. ఆర్ఎస్ఎస్ నేత దుర్గాప్రసాద్ స్మారక సభ నేటి ఉదయం విజయవాడలో జరుగగా, ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దుర్గాప్రసాద్‌తో తనకు గల అనుబంధాన్ని వెంకయ్య గుర్తు చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోదని ఆయన అన్నారు. భారతీయుల మధ్య ఐకమత్యం లేకపోవడం వల్లే విదేశీ దాడులు జరుగుతున్నాయని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు.