: నేరాలపై ఫిర్యాదులకు ఏటీఎం తరహా మిషన్లు


నేరాలు, అన్యాయాలపై ఫిర్యాదు చేయడానికి పోలీసుస్టేషన్ కు వెళ్లేందుకు జంకుతున్నారా? అయితే మీ కోసం వచ్చేస్తున్నాయి సరికొత్త మిషన్లు. అచ్చు ఏటీఎంల తరహాలో ఉండే వీటిల్లో కంప్లైంట్ పడేస్తే అది సరాసరి సంబంధిత పోలీసు స్టేషన్ కు చేరుతుంది. దీనివల్ల పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనం పెరగడంతో పాటు, పౌరుల నుంచి ఫిర్యాదు తీసుకోలేదన్న అపవాదులూ తగ్గుతాయని భావిస్తున్నారు. ఈ హై-టెక్ ప్రాజెక్టును అమలులోకి తీసుకురావాలని ప్రధాని మోదీ గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. నేడు గౌహతిలో జరగనున్న పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారుల జాతీయ స్థాయి సమావేశంలో ప్రధాని ఏటీఎం ఫిర్యాదు కేంద్రాలపై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటిని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రధాన మాల్స్ లోను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News