: వెంకన్న భక్తులపై టీటీడీ సిబ్బంది దురుసు ప్రవర్తన


తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులపై ఈరోజు టీటీడీ ఉద్యోగులు దురుసుగా ప్రవర్తించారు. వెంకన్న దర్శనం కోసం వచ్చిన భక్తులను సిబ్బంది మెడపట్టి మరీ గెంటేశారు. దీంతో భక్తులు ఆందోళనకు దిగారు. అయినా టీటీడీ సిబ్బందిలో కానీ, ఉన్నతాధికారుల్లో కానీ ఏమాత్రం సానుకూల స్పందన రాలేదు. రూ.300 ప్రత్యేక దర్శనం క్యూ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆన్ లైన్ లో గ్రూపు దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులను అనుమతించేందుకు సిబ్బంది నిరాకరించారు. దీంతో ఆందోళనకు దిగిన భక్తులను సిబ్బంది మెడపట్టి మరీ గెంటివేశారు. విషయం తెలిసిన ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనపై స్పందించిన పాపాన పోలేదు.

  • Loading...

More Telugu News