: ఏపీలో నాన్ లే అవుట్ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ జీవో విడుదల
ఆంధ్రప్రదేశ్ లో నాన్ లే అవుట్ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ జీవో నంబర్-398ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ క్రమంలో, వ్యవసాయ భూములను లే అవుట్ల కింద మార్చడానికి అనుమతి తప్పనిసరని తెలిపింది. ఈ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు కూడా తహశీల్దారు అనుమతి తప్పకుండా అవసరమని జీవోలో వెల్లడించింది. ఈ మేరకు ఏపీలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఆదేశాలు పంపింది.